CBSE Class 12 Results

Delhi: CBSE Results 15 July 2020. The Hon'ble Supreme Court issued instructions to Central Board of Secondary Education to release CBSE Class 12 results without examination.

దిల్లీ: సీబీఎస్‌ఈ పరీక్షల అంశంపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నిన్న కోర్టుకు తెలిపిన సమాచారం మేరకు సీబీఎస్‌ఈ విడుదల చేసిన నోటిఫికేషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం ఆమోదించింది. 12 వ తరగతి విద్యార్థులకు పరీక్షలు లేకుండా అంచనాలతో ఫలితాలు వెల్లడిస్తామని సీబీఎస్‌ఈ తెలిపింది. 

 జులై 15 నాటికి విద్యార్థుల అసెస్‌మెంట్‌ ఫలితాలు వెల్లడిస్తామని, సెప్టెంబర్‌ నాటికి పరిస్థితులు అనుకూలిస్తే అక్టోబరులో పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. ఆప్షనల్‌ పరీక్షలు రాయాలా? వద్దా? నిర్ణయించుకునే అధికారం విద్యార్థులదేనని స్పష్టం చేసింది. 

 అసెస్‌మెంట్‌ ఫలితాల కంటే ఎక్కువ మార్కులు వస్తాయనుకుంటే పరీక్షలు రాసేందుకు సిద్ధం కావొచ్చని సూచించింది. ఈమేరకు సీబీఎస్‌ఈ నోటిఫికేషన్‌ను ధర్మాసనం ఆమోదించింది. 

ఐసీఎస్‌ఈ ఫలితాలకు కూడా ఇదే పద్ధతిలో నోటిఫికేషన్‌ ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. అసెస్‌మెంట్‌లో సీబీఎస్‌ఈతో పోలిస్తే కొంత తేడా ఉంటుందని ఐసీఎస్‌ఈ తెలిపింది. స్వల్ప మార్పులతో వారం రోజుల్లో నోటిఫికేషన్‌ ఇస్తామని వెల్లడించింది. 

నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు ఐసీఎస్‌ఈకి సుప్రీంకోర్టు వారం రోజుల గడువు ఇచ్చింది. సీబీఎస్‌ఈ నోటిఫికేషన్‌తో పిటిషన్లపై విచారణను ముగించింది. ఇతర రాష్ట్రాల హైకోర్టు్ల్లో సీబీఎస్‌ఈ పరీక్షలపై పెండింగ్‌లో ఉన్న పిటిషన్లపై కూడా విచారణ ముగించినట్లు ధర్మాసనం తెలిపింది.

CBSE Exams: 10, 12 పరీక్షలు రద్దు... ప్రకటించిన సీబీఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE 10, 12వ తరగతుల్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని సుప్రీం కోర్టుకు తెలిపింది సీబీఎస్ఈ. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా కొన్ని పరీక్షలు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. జూలై 1 నుంచి జూలై 15 వరకు పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది సీబీఎస్ఈ. కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్‌కు హాజరయ్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల భద్రతను దృష్టిలో పెట్టుకొని పరీక్షల్ని రద్దు చేయాలని, పరీక్షలు మిగిలిన సబ్జెక్టులకు ఇంటర్నల్ మార్కుల ఆధారంగా మార్కులు వేయాలంటూ సుప్రీం కోర్టులో విద్యార్థుల తల్లిదండ్రులు పిటిషన్ వేశారు. 

కరోనా వైరస్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో 250 పాఠశాలల్లో క్లాస్ 10, 12 పరీక్షల్ని రద్దు చేసి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లేదా ఇంటర్నల్ అసెస్‌మెంట్ ద్వారా సీబీఎస్ఈ మార్కులు వేసిందని, అందరు విద్యార్థులకు అలాగే మార్కులు వేయాలని పేరెంట్స్ కోరారు. దీనిపై సుప్రీం కోర్టు పలుమార్లు విచారణ జరిపింది. పరీక్షల నిర్వహణపై నిర్ణయాన్ని తెలపాలంటూ సీబీఎస్ఈని సుప్రీం కోర్టు కోరింది. ఈ పిటిషన్‌పై మంగళవారం కూడా విచారణ జరిగింది. గురువారం లోగా నిర్ణయాన్ని ప్రకటిస్తామని సుప్రీం కోర్టుకు తెలిపింది సీబీఎస్ఈ. 10వ, 12వ తరగతుల పరీక్షల్ని రద్దు చేస్తున్నట్టు ఇవాళ సుప్రీం కోర్టుకు సీబీఎస్ఈ సమాచారం ఇచ్చింది.

No comments:

Post a Comment

Trending