ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ షురూ
25 నుంచి ధ్రువపత్రాల పరిశీలన
👉రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. వీటిలో సీట్ల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష ఫలితాలను సొసైటీ కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ విడుదల చేశారు.
👉దరఖాస్తు సమయంలోనే ఇచ్చిన కళాశాల ఎంపిక ఆప్షన్ ప్రకారం ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయించారు. కళాశాలలో సీట్లు పొందిన అభ్యర్థులకు కోర్సులవారీ షెడ్యూలు ప్రకారం ఈ నెల 25 నుంచి జులై 10 వరకు ధ్రువ పత్రాల పరిశీలన నిర్వహించనుంది.
👉బీఎస్సీ ఎంపీసీకి ఈనెల 25, 26 తేదీల్లో, బీఎస్సీ ఎంఎస్‌సీఎస్, బీఏ హెచ్‌ఈపీఏ, బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్‌కు ఈ నెల 27, 29న, బీఎస్సీ బీజెడ్‌సీ, ఎంపీసీఎస్, ఎన్‌డీజెడ్‌సీ, బీఏ ఈపీజే, బీకాం ఆనర్స్ కోర్సులకు ఈనెల 30, జులై 1న, బీఎస్సీ ఎంబీజెడ్‌సీ, ఎంఈసీస్, బీసీజెడ్‌సీ, బీఏ ఈపీఎస్, బీకాం టాక్సేషన్ కోర్సులకు జులై 2, 3న సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. అలాగే బీకాం కంప్యూటర్స్, బీఎస్సీ ఎంపీజీ, బీటీబీసీ, బీఏ ఈపీజీ కోర్సులకు జులై 4, 6న, బీకాం జనరల్, బీఎస్సీ బీజీసీ, బీఏ ఈపీపీఎస్‌కు జులై 7, 8న, బీఏ హెచ్‌ఈపీ, బీఎస్సీ బీసీఎఫ్‌ఎస్‌క్యూసీ, బీబీఏ కోర్సులకు జులై 9, 10న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.
👉కంటెయిన్‌మెంట్ జోన్లలోని అభ్యర్థులు పరిశీలనకు హాజరుకాలేని పరిస్థితుల్లో ధ్రువపత్రాలను ఆన్‌లైన్లో అందజేయవచ్చని, ఈ మేరకు ఆయా ప్రిన్సిపల్స్‌ను సంప్రదించాలని కార్యదర్శి సూచించారు
No comments:
Post a Comment