World Junosis Day 6th July

World Zoonoses Day 2020 : What is Zoonosis And How Does The Infectious Disease Spread

We are all very much acquainted with the COVID-19 pandemic that is going on around the world right now, though at the start we had very little information about it. There have been reports of the infectious disease spreading from bats to humans and then from there to other humans. This kind of infection is known as a zoonosis. So on World Zoonoses Day 2020, which is marked on July 6, we take a look at what it is all about. Also Read - Scientists Develop a Novel Technique to Prevent Relapsing of COVID-19 And Other Infectious Diseases

🔥జూలై 06న వ‌రల్డ్ జూనోసిస్ డే🔥

👉ప్ర‌తి ఏడాది జూన్ 6న ‘వ‌రల్డ్ జూనోసెస్ డే’ ని జ‌రుపుకుంటారు.


🐕జూనోటిక్ వ్యాధుల గురించి, వాటిని ఎలా నివారించాలి వంటి త‌దిత‌ర విష‌య‌లాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే ఈ దినోత్స‌వ ముఖ్యోద్దేశం. ప‌శువై ద్యుల నిర్వ‌చ‌నం ప్ర‌కారం గీకు ప‌ద‌మైన ‘జూనోసెస్ ‘అంటే ‘జూన్‘ అంటే జంతువు, ‘నోసోస్’ అంటే అనారోగ్యం. జూనోసిస్ అంటే జంతువుల నుండి ప్ర‌జ‌ల‌కు వ్యాపించే అంటువ్యాధులు. జూలై 6 జూనోటిక్ వ్యాధికి వ్య‌తిరేకంగా మొద‌టి టీకాల‌ను వేసిన శాస్త్రీయ విజ‌యాన్ని తెలియ‌జేస్తోంది.

🐈లూయిస్ పాశ్చ‌ర్ అనే ఫ్రెంచ్ జీవ శాస్త్ర‌వేత్త కుక్క‌ల నుంచి రాబిస్ వ్యాధి వ‌స్తుంద‌ని గుర్తించ‌డ‌మే కాక దానికి టీకా మందును క‌నుగొన్నారు. ఆయ‌న విజ‌యానికి గుర్తుగా జూలై 6న ప్ర‌పంచ జూనోసిస్ డేని జ‌రుపుకుంటున్నారు. పాశ్చ‌ర్ మైక్రోబ‌యాల‌జిస్ట్, ర‌సాయ‌న శాస్త్ర‌వేత్త‌. అత‌ను టీకాలు, సూక్ష్మజీవుల కిణ్వ‌న‌ప్ర‌క్రియ, పాశ్చ‌రైజేష‌న్ వంటి వాటిని క‌నుగొన్నాడు. ఆంత్రాక్స్ వ్యాధికి టీకాల‌ను క‌నుగొన్నాడు. ఇప్ప‌టివ వ‌ర‌కు సుమారు 150 జూనోటిక్ వ్యాధులు ఉన్న‌ట్లు గుర్తించారు. పౌల్ట్రీ, ఎలుక‌లు, సరీసృపాలు, ఉభయచరాలు, కీటకాలు మరియు ఇతర దేశీయ లేదా అడవి జంతువుల కార‌ణంగానో ప్రజలు జూనోటిక్ వ్యాధుల బారిన ప‌డతారు. ఈ వ్యాధులు దోమ కాటు ద్వారా వ్యాప్తి చెందుతాయి.

👉జూనోటిక్ వ్యాధులు:

*🦠ప్లేగు, క్షయ, క్యాట్ స్క్రాచ్ ఫీవర్, పక్షవాతం, హాంటావైరస్, రింగ్వార్మ్, సాల్మొనెలోసిస్, లెప్టోస్పిరోసిస్, లైమ్ డిసీజ్. క్యాంపిలోబాక్టర్ ఇన్ఫెక్షన్, గియార్డియా ఇన్ఫెక్షన్, క్రిప్టోస్పోరిడియం ఇన్ఫెక్షన్, రౌండ్‌వార్మ్స్‌, హుక్వార్మ్స్, గజ్జి త‌దిత‌రాలు.

ఇప్పుడు ప్రపంచం అంత బయ భాంత్రుల్లో దడ దడ లాడుతుంది. ఎక్కడో చైనా నుంచి వచ్చినా వైరస్ దేశం మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తున్నది. ఈ వైరస్ సోకడానికి కారణం మానవ తప్పిదమే అని నిపుణులు సూచిస్తున్నారు. వివిధ రకాల వైరస్‌ల వల్ల సంక్రమిస్తోన్న వ్యాధులను ఆంగ్లంలో ‘జూనాటిక్‌డిసీసెస్‌’ లేదా ‘జూనోసెస్‌’ అని అంటారు. అంటే జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులని అర్థం. మానవులకు సంక్రమించే వ్యాధుల్లో 75 శాతం అంటువ్యాధులు కాగా, వాటిలో 60 శాతం జంతువుల నుంచి సంక్రమిస్తున్నవే. నేడు ప్రపంచ దేశాల ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న కోవిడ్‌వైరస్‌కూడా ఆ కోవకు చెందినదే., గబ్బిలాలు పాములు వాళ్ళ ఈ వైరస్ మానవులకి సోకింది, కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన సార్స్‌(సీవియర్‌అక్యూట్‌రెస్పిరేటరీ సిండ్రోమ్‌) పునుగు పిల్లుల నుంచి మానవులకి వచ్చింది. అలాగే మెర్స్‌(మిడిల్‌ఈస్ట్‌రెస్పిరేటరీ సిండ్రోమ్‌), ఒంటెల వల్ల వచ్చింది. అలాగే ఎబోలా, బర్డ్‌ఫ్లూలు కోళ్ల వల్ల మానవులకి సంక్రమించాయి.*

▪️జంతువులు, ఇతర వన్య ప్రాణులు జీవించే అడువులను నరికి వేయడం వల్ల జంతువుల ఆరోగ్యం క్షీణించి వైరస్‌ల బారిన పడుతున్నాయి. మానవులు విచక్షణ రహితంగా అడవులని నరికి కొట్టేస్తున్నారు. దీంతో జంతువులకి నివసించే ప్రదేశం లేక అల్లాడుతున్నాయి. కాలుష్యం కూడా బాగా పెరిగిపోయింది. బలిష్టంగా రూపాంతరం చెంతుతోన్న పలు రకాల వైరస్‌లు వాటి నుంచి మనుషులకు సోకుతున్నాయి. అడవులను నరికివేయడం వల్ల పర్యావరణ పరిస్థితులు దెబ్బతినడంతోపాటు ఇలాంటి అనర్థాలు సంభవిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం విభాగం 2016లోనే ఓ నివేదికలో హెచ్చరించింది.

▪️అతి తక్కువ స్థలంలో జన సాంద్రత ఎక్కువగా ఉండడం, సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఒకరికి సోకిన వైరస్‌ఇతరులకు వేగంగా వ్యాపిస్తోందని ఆ నివేదికలో ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. వైద్య సదుపాయం కూడా ఇప్పటికి కొన్ని కొన్ని ప్రాంతాలలో సరిగా లేదు. దీనివల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాధి సంక్రమణ అధికం అవుతుంది. పర్యావరణ ఆరోగ్యం సరిగ్గా ఉన్నప్పుడే ప్రపంచ మానవాళి మనుగడ బాగుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆహార, వ్యవసాయ సంస్థ పిలుపునిచ్చింది. ‘జంతువులు, అడవుల ఆరోగ్యంపైనే మానవులు ఆరోగ్యం ఆధారపడి ఉంది’ అని ‘ది సెంటర్‌ఫర్‌పీపుల్‌అండ్‌ఫారెస్ట్స్‌ఇన్‌బ్యాంగ్‌కాగ్‌’ ఎగ్సిక్యూటివ్‌డైరెక్టర్‌డేవిడ్‌గ్యాంగ్‌వ్యాఖ్యానించారు. వైరస్‌ల విజృంభణకు మానవ తప్పిదనమని స్పష్టం అవుతోంది. ఇప్పటికన్నా మనం చేసే తప్పులు తెలుసుకుని పర్యావరణాన్ని కాపాడదాం. పచ్చదనమే -పర్యావరణం అని అందరికి చాటుదాం.

No comments:

Post a Comment

Trending