General Knowledge - Indian Political Bits - English / Telugu ఇండియన్ పాలిటి బిట్స్ 30.06.2020
1)ప్రాథమిక హక్కుల్లో రాజ్యం నిర్వచనం గురించి తెలిపే ఆర్టికల్ ఏది?
జ: 12.
1)Which article addresses the definition of 'State' in fundamental rights?
Ans: 12.
2)రాజ్యాంగంలోని 14వ నిబంధన ప్రకారం ‘చట్టం ముందు అందరూ సమానులే’ అనే భావనను ఏ దేశం నుంచి గ్రహించారు?
జ: బ్రిటన్.
2)Under Article 14 of the Constitution, from which country is the concept of equality applied before the law?
Ans: Britain.
3)పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించే మార్గదర్శక సూత్రాలను సుప్రీంకోర్టు ఏ కేసులో వెలువరించింది?
జ: విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 1997.
3)In which case did the Supreme Court outline guidelines for preventing sexual harassment of women in the workplace?
Ans: Vishakha vs. State of Rajasthan 1997.
4)ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు కొన్ని తరాల నుంచి సామాజికంగా, విద్య పరంగా వెనకబాటుకు గురయ్యాయనే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించ వచ్చని తెలిపే ఆర్టికల్ ఏది?
జ: 15 (4).
4)SC, ST, BC Which article states that the government has been providing special facilities for public sector employees for the purpose of social and educational backwardness?
Ans: 15 (4).
5).‘కుల ప్రాతిపదికన విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు చెల్లవు’ అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు వెలువరించింది?
జ: చంపకం దొరై రాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ - 1951.
5)In which case was the Supreme Court ruled that caste-based reservations in educational institutions were invalid?
Ans: Korakam Durai Rajan vs. Madras State - 1951.
6)ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు లభించకపోతే వాటిని బ్యాక్‌లాగ్ పోస్టులుగా ప్రకటించాలని ఎన్నో రాజ్యాంగ సవరణలో పొందుపరిచారు?
జ: 81వ రాజ్యాంగ సవరణ చట్టం - 2000.
6)What is the amendment to the constitution to declare backlog posts if eligible candidates are not available for the jobs assigned to SC and ST?
Ans: The 81st Amendment Act, 2000.
7)మండల్ కమిషన్‌ను నియమించిన ప్రధాన మంత్రి ఎవరు?
జ: మొరార్జీ దేశాయ్.
7)Who is the Prime Minister appointed by the Mandal Commission?
Ans: Morarji Desai.
8)క్రీమిలేయర్ వర్గాలను గుర్తించడానికి 1993 లో నియమించిన కమిటీ/కమిషన్ ఏది?
జ: రామ్‌నందన్ ప్రసాద్ కమిటీ.
8)What was the committee or commission appointed in 1993 to identify the creamy layer communities?
Ans: Ramnandan Prasad Committee.
9)షెడ్యూల్డ్ కులాలు, తెగలపై అకృత్యాల నిషేధించే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు?
జ: 1989.
9)In which year was the SC and ST Atrocity Act enacted that prohibits acts on scheduled castes and tribes?
Ans: 1989.
10)‘రాజ్యాంగంలోని 18వ నిబంధన ప్రకారం బిరుదులను ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధం’ అని ఏ హైకోర్టు పేర్కొంది?
జ: మధ్యప్రదేశ్ హైకోర్టు.
10)Which High Court believes that the declaration of titles under Article 18 of the Constitution is unconstitutional?
Ans: Madhya Pradesh High Court
No comments:
Post a Comment